హిందీలో కేజీఎఫ్‌ 2 సక్సెస్‌పై అభిషేక్‌ బచ్చన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. | Abhishek Bachchan On Pan India Movies Does not Believe In The Term | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: పాన్‌ ఇండియా అనే పదాన్ని నేను నమ్మను: అభిషేక్ బచ్చన్‌

Apr 26 2022 2:15 PM | Updated on Apr 26 2022 2:16 PM

Abhishek Bachchan On Pan India Movies Does not Believe In The Term - Sakshi

తాజాగా పాన్ ఇండియా చిత్రాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అభిషేక్. పాన్‌ ఇండియా పదంపై తనకు నమ్మకం లేదన్నాడు. బాలీవుడ్‌ సినిమాల్లో కంటెంట్‌ లేదన్న వాదనను తిరస్కరించాడు. ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమని అభిషేక్‌ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. 

Abhishek Bachchan On Pan India Movies Does not Believe In The Term: బాలీవుడ్‌ హీరో అభిషేక్ బచ్చన్‌ ఇటీవల 'దస్వీ' చిత్రంతో నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చదువుకు ఉన్న ప్రాధాన్యత తెలుపుతూ తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా చిత్రాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అభిషేక్. పాన్‌ ఇండియా పదంపై తనకు నమ్మకం లేదన్నాడు. బాలీవుడ్‌ సినిమాల్లో కంటెంట్‌ లేదన్న వాదనను తిరస్కరించాడు. ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమని అభిషేక్‌ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. 

'పాన్‌ ఇండియా అనే పదంపై నాకు నమ్మకం లేదు. మరేదైనా ఇండస్ట్రీకి ఈ పదాన్ని వాడుతున్నామా ? లేదు కదా. కేజీఎఫ్‌ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హిందీలో మంచి వసూళ్లు సాధించాయి. మంచి సినిమా హిట్‌ అవుతుంది. లేకుంటే ప్లాప్ ఎక్కడైనా ప్లాప్‌ అవుతుంది. బాలీవుడ్‌లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదనడం సరికాదు. గంగుబాయి కతియావాడి, సూర్యవంశీ మంచి హిట్‌ సాధించాయి. రీమేక్ అనేది ఎప్పుడూ జరిగేదే. అది ఒక చాయిస్ మాత్రమే. మన దగ్గర సినీ ప్రియులు ఎక్కవ. సినిమాకు భాషతో పనిలేదు. ఏ భాషలో వచ్చిన అంతిమంగా అది సినిమానే. వివిధ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే. ఏదిఏమైనా మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే.' అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు. కాగా అభిషేక్ బచ్చన్‌ ప్రస్తుతం 'బ్రీత్‌' వెబ్‌ సిరీస్‌ మూడో సీజన్‌లో నటిస్తున్నాడని సమాచారం. 

చదవండి: అభిషేక్‌ బచ్చన్‌ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే..


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement