
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. హాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లొ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ప్రభాస్ పై హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.
మీరు తెరకెక్కిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్-7’లో ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కీ రోల్ పోషించనున్నారంటూ గత కొంతకాలంగా ఇక్కడ పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి అందులో ఎంత నిజముందో చెప్పగలరు?’ అని నెటిజన్ కోరగా.. ‘ప్రభాస్ ఎంతో టాలెంట్ కలిగిన వ్యక్తి. కానీ ఇప్పటి వరకూ ఆయన్ని నేను కలవలేదు’ అని క్రిస్టోఫర్ రిప్లై ఇచ్చారు. ఆయన పెట్టిన ట్వీట్‌తో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
While he‘s a very talented man, we’ve never met.
— Christopher McQuarrie (@chrismcquarrie) May 26, 2021
Welcome to the internet. https://t.co/mvVFP6N4zV