దిల్‌ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత! | Dil Raju Family Popped At Hyderabad Airport For Jaipur Grand Wedding | Sakshi
Sakshi News home page

Dil Raju: జైపూర్‌కు దిల్‌ రాజు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Published Mon, Feb 12 2024 7:38 PM | Last Updated on Wed, Feb 21 2024 1:34 PM

Dil Raju Family Popped At Hyderabad Airport For Jaipur Grand Wedding - Sakshi

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్‌ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న  జైపూర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్‌ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ ‍వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్‌లో రౌడీ బాయ్స్‌ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement