Deepika Padukone First Look Poster Out From Prabhas Project K Movie, See Netizens Reactions - Sakshi
Sakshi News home page

Project K: దీపికా పదుకోన్‌ ఫస్ట్‌ లుక్‌..ఆమె కళ్లల్లో కొత్త ప్రపంచంపై నమ్మకం

Jul 19 2023 10:08 AM | Updated on Jul 19 2023 11:28 AM

Deepika Padukone First Look Out From Project K Movie - Sakshi

ఆమె కళ్లు ఎటో తీక్షణంగా చూస్తున్నాయి.  దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనబడుతోందామె. ‘ప్రాజెక్ట్‌ కె’లో దీపికా పదుకోన్‌ చేస్తున్న పాత్ర లుక్‌ ఇది. ‘‘ఆమె కళ్లల్లో కొత్త ప్రపంచంపై నమ్మకం కనిపిస్తోంది’’ అంటూ దీపికా లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతున్నారు.  

సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ప్రాజెక్ట్‌ కె’ టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని ఈ నెల 20న అమెరికాలోని ‘శాన్‌ డియాగో కామిక్‌– కాన్‌ 2023’ వేడుకలో లాంచ్‌ చేస్తారు. ఈ వేడుకకు ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, నాగ్‌ అశ్విన్, అశ్వనీదత్‌ హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement