
మెగా అభిమాన సంఘాలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఫ్యాన్స్‌కు వద్దని వారించారు. అది మన సంస్కారం కాదంటూ అఖిల భారత చిరంజీవి యువతకు సూచించారు. మెగాస్టార్ విజ్ఞప్తితో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అభిమానులు విరమించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఫ్యాన్స్.. బాలయ్యపై పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
మెగాస్టార్ వద్దని వారించడంతో తమ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. అభిమాన సంఘాల విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అప్రమత్తమై వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు.