చిరంజీవి సర్జా ఇంట చేదు వార్త.. | Chiranjeevi Sarja Wife Meghana Raj Son Tested Covid 19 Positive | Sakshi
Sakshi News home page

నేను, నా కుమారుడు కోవిడ్‌ బారిన పడ్డాం: నటి

Dec 8 2020 5:47 PM | Updated on Dec 8 2020 9:52 PM

Chiranjeevi Sarja Wife Meghana Raj Son Tested Covid 19 Positive - Sakshi

‘‘హలో.. మా అమ్మానాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది... గత కొన్ని వారాలుగా..

బెంగళూరు: నటి, దివంగత హీరో చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్‌ కరోనా బారిన పడ్డారు. వారి చిన్నారి కుమారుడికి కూడా కోవిడ్‌ సోకింది. ఈ విషయాన్ని మేఘనా రాజ్‌ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం నోట్‌ షేర్‌ చేశారు. ‘‘హలో.. మా అమ్మానాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది... గత కొన్ని వారాలుగా మమ్మల్ని కలిసిన వారు కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం.. ప్రస్తుతం మేం చికిత్స పొందుతున్నాం.. చిరు అభిమానులకు ఓ విజ్ఞప్తి.. జూనియర్‌ చిరు ఆరోగ్యం బాగుంది. నేనెల్లప్పుడూ తనతోనే ఉంటున్నా.

దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు.. మహమ్మారిపై యుద్ధంలో మా కుటుంబం గెలుపొందుతుంది. వైరస్‌ను జయిస్తాం’’ అని మేఘన పేర్కొన్నారు.  కాగా సౌతిండియా సీనియర్‌ హీరో అర్జున్‌ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా(36) జూన్‌ 7న గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. ఇక అప్పటికే గర్భవతి అయిన చిరు భార్య మేఘనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అయితే భర్త భౌతికంగా దూరమైనా, తన మనసులో ఎప్పుడూ బతికే ఉంటారంటూ ధైర్యం కూడదీసుకున్న ఆమె, భర్త కటౌట్‌ పక్కన పెట్టుకుని సీమంతం వేడుక చేసుకున్నారు. అక్టోబరులో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.(చదవండి: ప్రేమ పెళ్లి: దారుణంగా హింసించేవాడు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement