
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుటికే ఆయన నటించిన మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తయింది. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కావాల్సింది ఉండగా.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా జూన్ 16కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనైనప్పటికీ.. సమ్మర్‌లోనైనా సందడి చేస్తాడనే ఆశతో ఉన్నారు.
ఆదిపురుష్ విడుదలైన కొద్ది రోజులకే ‘సలార్’ వస్తుందని.. వచ్చే ఏడాదంతా తమ హీరో హవానే కొనసాగుతుందనే ధీమాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఓ వార్త కలవరపెడుతోంది. ఆదిపురుష్ మాదిరే సలార్ కూడా వాయిదా పడబోతుందట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ దాదాపు వాయిదా పడినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఆదిపురుష్ వాయిదా ఎఫెక్ట్ తమ సినిమాపై ఉంటుందని, అందుకే సెప్టెంబర్‌లో విడుదల చేయ్యొద్దని చిత్ర యూనిట్ భావిస్తోందట. కేవలం మూడు నెలల వ్యవధి లో ప్రభాస్ నుంచి రెండో సినిమా వస్తే కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని.. కనీసం ఆరు నెలల గ్యాప్ అయినా ఇవ్వాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు, పృథ్వీరాజ్ కీ రోల్ చేస్తున్నారు.