ప్రభాస్‌కి 'ఆదిపురుష్' హిట్ చాలా ముఖ్యం.. ఎందుకో తెలుసా?

Adipurush Movie Success Important To Prabhas, Reasons Inside - Sakshi

'ఆదిపురుష్'.. మీలో చాలామంది ఈ సినిమా గురించే ఆలోచిస్తున్నారు కదా!? లేదని మాత్రం చెప్పకండి ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హవా అంతా 'ఆదిపురుష్'దే. ఎక్కడా చూసినా జైశ్రీరామ్ పాటనే వినిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే 'ఆదిపురుష్' హిట్ అనేది ఇండస‍్ట్రీకే కాదు ప్రభాస్ కి కూడా చాలా అంటే చాలా ముఖ్యం.. ఎందుకో తెలుసా?

డార్లింగ్ ప్రభాస్.. కొన‍్నేళ్ల ముందు ఈ పేరు కేవలం తెలుగు ఆడియెన్స్ కి మాత్రమే తెలుసు. ఆరడుగుల కటౌట్, సూపర్ ఫిజిక్.. మాస్ సినిమాలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ. ఫ్యాన్స్ అరిచిగోల చేయడానికి ఇంతకంటే ఏం కావాలి. అయితే రాజమౌళి మాత్రం ప్రభాస్ లో 'బాహుబలి'ని చూశాడు. తెలుగు సినిమాతోపాటు ప్రభాస్ రేంజ్‌ని ఓ రేంజ్‌లో పెంచేశాడు. పాన్ ఇండియా స్టార్ ని చేసి పడేశాడు.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' సినిమా గురించి ఇవి మీకు తెలుసా?)

'బాహుబలి' తర్వాత ప్రభాస్.. చాలా సినిమాలు ఒ‍ప్పుకొన్నాడు. వాటిలో 'సాహో', 'రాధేశ్యామ్' ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ పూర్తిస్థాయిలో మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా పడలేదే అనే లోటు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. చాలామంది 'సలార్' మూవీతో ఈ కోరిక తీరుతుందని అనుకున్నారు. కానీ 'ఆదిపురుష్' సీన్ లోకి వచ్చింది.

'ఆదిపురుష్' టీజర్ గతేడాది సెప్టెంబరులో రిలీజ్ కాగానే.. మూవీలోని గ్రాఫిక్స్ పై చాలా ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. డైరెక్టర్ ఓం రౌత్ ని.. ఫ్యాన్స్ బండబూతులు తిట్టారు. దీంతో మరో రూ.100 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ లో మార్పులు చేశారు. ట్రైలర్స్ లో ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

అయితే 'ఆదిపురుష్' ఎలా ఉండబోతుందా అని తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే మరికొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ సినిమా హిట్ అయితేనే ప్రభాస్ ఇమేజ్ మరింత స్ట‍్రాంగ్ అవుతుంది. లేదంటే మాత్రం మళ్లీ 'సలార్' కోసమో, 'ప్రాజెక్ట్ K ' కోసమో ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలి మరి 'ఆదిపురుష్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో?

(ఇదీ చదవండి: Shaitan Review: ‘సైతాన్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top