కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్‌ | Brahmanandam Special Gift To Krishnam Raju | Sakshi
Sakshi News home page

Brahmanandam: కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్‌

Oct 30 2021 2:01 PM | Updated on Oct 30 2021 3:32 PM

Brahmanandam Special Gift To Krishnam Raju - Sakshi

కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇటీవల కృష్ణంరాజు తుంటికి శస్త్ర చికిత్స జరిగిన తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బ్రహానందం కృషంరాజు ఇంటికి వెళ్లారు. ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం తాను స్ఫెషల్‌గా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వల్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

‘మన కామెడీ జీనియస్‌.. ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్‌ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్‌ ది స్పెషల్‌ సర్‌ప్రైజ్’అంటూ బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు కృష్ణం రాజు. కాగా, గతంలో అల్లు అర్జున్‌, రానాలకు కూడా తాను స్వయంగా గీసిన చిత్రపటాలను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మీ.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ మూవీలో నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement