బిగ్‌బాస్‌ షోలో నాకు బాగా కావాల్సిన వ్యక్తి అతడే, సపోర్ట్‌ చేయండి: సందీప్‌ కిషన్‌

Bigg Boss Telugu 5: Sundeep Kishan Supports Maanas - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు బుల్లితెర నటుడు మానస్‌ నాగులపల్లి. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంటున్నాడు. ఎక్కడా ఆవేశానికి పోకుండా ప్రతి విషయాన్ని చాలా సెన్సిటివ్‌గా డీల్‌ చేస్తున్నాడు. ఎదుటివాళ్లు ఎంత రెచ్చగొట్టినా తన సహనాన్ని కోల్పోకపోవడం అతడిలో ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు మానస్‌ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. అతడికి ప్రముఖ టాలీవుడ్‌ హీరో నుంచి మద్దతు లభించింది. సందీప్‌ కిషన్‌ మానస్‌కు సపోర్ట్‌ చేయమని అభ్యర్థిస్తూ ఓ వీడియో చేశాడు. నిజానికి ఈ వీడియో బిగ్‌బాస్‌ షో ప్రారంభానికి ముందే చేసినప్పటికీ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇక ఈ వీడియోలో సందీప్‌ కిషన్‌ ఏమన్నాడంటే.. 'హలో అందరికీ , నేను మీ సందీప్‌ కిషన్‌ను. బిగ్‌బాస్‌ షోలో నాకు నచ్చిన, బాగా కావాల్సిన వ్యక్తి మానస్‌ నాగులపల్లి పాల్గొన్నాడు. ఎంతో మంచి మనసున్న అతడు మీ అందరికీ నచ్చుతాడనుకుంటున్నాను. మానస్‌ చాలామంది మనసులు గెలుచుకుని బయటకు వస్తాడని కోరుకుంటూ ఆల్‌ ద బెస్ట్‌, లవ్‌ యూ..' అని చెప్పుకొచ్చాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top