ఈ ఓవరాక్షనే తగ్గించుకుంటే మంచిది: నటిపై ట్రోలింగ్‌

Bigg Boss Contestant Arti Singh Trolled On Covid 19 Vaccine Post - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎంతోమందిని కబళిస్తోంది. దీంతో ఎన్నో రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించి ప్రజలను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌ నుంచి కాపాడుకునేందుకు టీకా కూడా అందుబాటులో వచ్చింది. అయితే ఇప్పటికీ టీకా మీద చాలామందికి అపోహలు ఉండటంతో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి జంకుతున్నారు. దీంతో సెలబ్రిటీలు రంగంలోకి దిగుతూ ఇలాంటి భయాందోళనలకు పుల్‌స్టాప్‌ పెట్టి నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ క్రమంలో వారు టీకా వేసుకుంటున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆర్తి సింగ్‌ సైతం తన తొలి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఫొటోను అభిమానులతో షేర్‌ చేసుకుంది. 'ఇంజక్షన్‌ అంటే పుట్టెడు భయం.. అయినా టీకా వేసుకున్నా.. ఎందుకంటే మనం కలిసి పోరాడాల్సింది చాలా ఉంది' అని రాసుకొచ్చింది. కానీ కొందరు నెటిజన్లకు ఆమె మాటలు మింగుడుపడలేదు. 'చేతి మీద పచ్చబొట్టు వేసుకోవడానికి లేని భయం ఇంజక్షన్‌ పొడిపించుకోవడానికి ఎందుకట?' అని పెదవి విరుస్తున్నారు. 'ఇది మరీ టూ మచ్‌, ఈ ఓవరాక్షన్‌లే తగ్గించుకుంటే మంచిది' అని ఏకిపారేస్తున్నారు.

చదవండి: కొత్త ఇంటికి మారిన బిగ్‌బాస్‌ భామ​ అరియానా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top