ఇదొక కొత్త ప్రయత్నం | Ashish Reddy Love Me Movie Song Launch | Sakshi
Sakshi News home page

ఇదొక కొత్త ప్రయత్నం

Published Sun, Mar 31 2024 1:11 AM | Last Updated on Sun, Mar 31 2024 1:11 AM

Ashish Reddy Love Me Movie Song Launch - Sakshi

దిల్‌ రాజు 

ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లవ్‌ వీ’. ‘ఇఫ్‌ యు డేర్‌’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు ప్రోడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌ హైదబాద్‌లో జరిగింది.

కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్‌ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్‌ పేర్కొంది. ‘‘లవ్‌ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్‌’ రాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement