దురంధర్‌-2పై విమర్శలు.. దెబ్బకు సోషల్ మీడియా ఖాతా డిలీట్...! | Aneet Padda Sister Reet Deletes Instagram Amid Dhurandhar The Revenge Movie Faces Propaganda Backlash, Read Story Inside | Sakshi
Sakshi News home page

Aneet Padda: దురంధర్‌-2పై విమర్శలు.. ఏకంగా ఇన్‌స్టా ఖాతా డిలీట్..!

Mar 29 2026 2:21 PM | Updated on Mar 29 2026 4:30 PM

Aneet Padda sister Reet deletes Instagram amid Dhurandhar backlash

మార్చి నెల అంతా దురంధర్‌ పేరే వినిపిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటేసింది. వసూళ్ల పరంగా ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. పార్ట్-1 రిలీజైన మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా రావడంతో ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి నుంచే భారీ అంచనాలు ఉండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే సౌత్ స్టార్స్‌ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్: ది రివెంజ్' మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.

అయితే ఈ మూవీ ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. విమర్శలు సైతం అదేస్థాయిలో చేస్తున్నారు. ప్రాపగండ అనే ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్ నటి అని అనీల్ పడ్డా సోదరి రీత్ పడ్డా దురంధర్‌ సీక్వెల్‌పై విమర్శలు చేసింది. ఈ సినిమా 'ది కేరళ స్టోరీ', 'ది కాశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాల్లాగే ప్రాపగండగా చిత్రీకరించారని కామెంట్స్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. 

ఈ వివాదంతో ఊహించని విధంగా ఆమె ఇన్‌స్టా ఖాతా డిలీట్‌ చేసేసింది. మొదట ప్రైవేట్‌గా ఉంచిన రీత్ పడ్డా.. ఆ తర్వాత ఏకంగా ఖాతానే తొలగించింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమె ప్రొఫైల్ అందుబాటులో లేదు. ఈ వివాదం తర్వాత ఆమె లింక్డ్‌ఇన్ ఖాతాను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ధురందర్‌తో సహా ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ చిత్రాలను రీత్ విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది.  దీనిపై నెట్టింట పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో ఏకంగా సోషల్ మీడియా ఖాతానే మూసేయాల్సి వచ్చింది.

అంతేకాకుండా రీత్ వ్యక్తిగత జీవితంపై కూడా ఆన్‌లైన్‌లో ట్రోల్స్ వచ్చాయి. ఫాజిల్ అహ్మద్ అనే వ్యక్తితో ఆమెకు రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.  అయితే తమపై వస్తున్న ట్రోల్స్‌పై రీత్ గానీ, అనీత్ పడ్డా గానీ వాటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు నటి అనీత్ పడ్డా  మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'శక్తి శాలిని' చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement