
యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj )కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. సినిమాల్లో కాకున్నా, సోషల్ మీడియాలో గ్లామరస్ పోస్టులు, వీడియోల ద్వారా మెరిపిస్తూ ఉంటుంది. తన దుస్తులు, వస్త్రధారణ విషయంలో వచ్చే విమర్శలకు ఘాటుగా బదులిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.
అయితే తనపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. తన ఎలా జీవించాలనుకుంటున్నానో..అలాగే జీవిస్తుంది. తన డ్రెస్సింగ్ కామెంట్స్ చేస్తే అస్సలు పట్టించుకోదు. ఇంకా చెప్పాలంటే.. గతం కంటే మరింత గ్లామర్గా రెడీ అయి ఫోటో షూట్ చేస్తోంది.
తాజాగా అనసూయ తన ఇన్స్టాలో స్వీమ్ సూట్ ఫోటోలను షేర్ చేసింది. స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన అనసూయ.. ఐస్ల్యాండ్లో స్వీమ్ సూట్లో ఫోటోషూట్ చేసింది. బ్లాక్ స్విమ్ సూట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేయగా..అవి కాస్త వైరల్గా మారాయి. ‘న్యూ వెర్షన్.. 3.ఓ’, హాటీ అలర్ట్, వీకెండ్ బ్లాస్ట్’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా, గతంలో కూడా అనసూయ బికీనీ, స్వీమ్ షూట్ ఫోటోలను షేర్ చేసింది.
ఇక తన డ్రెస్సింగ్‌పై కామెంట్ చేస్తున్నవారిపై గతంలో అనసూయ తీవ్రంగా మండిపడ్డారు. ‘నా భర్త, పిల్లలను నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. వారెప్పుడు నన్ను జడ్జ్ చేయలేదు. బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే నేను నా విలువలను కోల్పోయానని కాదు. నన్ను ఆదర్శంగా తీసుకోమని ఎవరికి చెప్పడం లేదు. నాకు నచ్చినట్లుగా నేను బతుకున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు బతకండి’ అని అన్నారు.