Laxmi Movie Record: రికార్డులను షేక్‌ చేస్తున్న బాలీవుడ్‌ ‘లక్ష్మీ' | Laxmii Movie Television Premiere Records - Sakshi
Sakshi News home page

రికార్డులను షేక్‌ చేస్తున్న బాలీవుడ్‌ ‘లక్ష్మీ'

Apr 3 2021 12:01 PM | Updated on Apr 3 2021 2:22 PM

Akshay Kumar Laxmii Breaks All Records Becomes Most Watched Film On Television - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, రాఘవ లారెన్స్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘లక్ష్మీ'  రికార్డులను షేక్‌ చేస్తోంది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌పై బ్లాక్‌బస్టర్ రేటింగ్‌ను నమోదు చేసిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. 2.51 కోట్లకు పైగా వ్యూయర్ షిప్‌తో అతిపెద్ద ప్రీమియర్‌ రికార్డును కొట్టేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోతూ 2.50 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ బ్రేకింగ్ టీఆర్‌పీని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అత్యధిక ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇంప్రెషన్స్‌ సాధించిన మూవీగా ‘లక్ష్మీ' నిలవడంపై సంతోషంగా ఉందని రాఘవ లారెన్స్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా అక్షయ్‌కు,  రాఘవేంద్రస్వామికి ధన్యవాదాలు  తెలిపాడు. (టైటిల్‌లో మార్పులు.. కొత్త పోస్టర్‌ విడుదల)

హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన  ‘లక్ష్మీ’ ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌కు ప్రేక్షకుల నుంచి దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా మార్చి 21 న స్టార్ గోల్డ్‌లో  రిలీజైన ఈ మూవీకి టెలివిజన్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో బాలీవుడ్‌  చిత్రాల చరిత్రను తిరగరాసింది రాఘవ లారెన్స్ దర్శకత్వంలో  వచ్చిన తొలి హిందీ మూవీ ఇది. రాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో  సౌత్‌లో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా  ‘లక్ష్మీ’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement