టైటిల్‌లో మార్పులు.. కొత్త పోస్టర్‌ విడుదల | After Title Change, Akshay Kumar Shares New Poster of Laxmii | Sakshi
Sakshi News home page

టైటిల్‌లో మార్పులు.. కొత్త పోస్టర్‌ విడుదల

Nov 2 2020 11:22 AM | Updated on Nov 2 2020 12:05 PM

After Title Change, Akshay Kumar Shares New Poster of Laxmii - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రూపొందిన హర్రర్‌- కామెడీ చిత్రం ‘లక్ష్మీ‌’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. షూటింగ్‌ అంతా పూర్తి చేస్తున్న ఈ సినిమా ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా లక్ష్మీ బాంబ్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తీరా సమయానికి టైటిల్‌లో లక్ష్మీ అనే పేరు ఉందని, లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని దానిని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన సినిమా యూనిట్‌కు నోటీసులు పంపింది. దీంతో టైటిల్‌ మార్చేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలో లక్ష్మి బాంబ్‌ సినిమా పేరును బాంబ్‌ తొలగించి లక్ష్మీ అనే పేరుగా మార్చారు. చదవండి: అక్ష‌య్‌ను టార్గెట్ చేసిన నెటిజ‌న్లు..తీరు మార్చుకోరా?

తాజాగా హాలోవీన్ సందర్భంగా అక్షయ్ కుమార్ సినిమా టైటిల్‌లో మార్పులు చేసిన అనంతరం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మధ్యలో కియారా అద్వానీ ఉండగా వెనక అక్షయ్‌ కనిపిస్తున్నారు. ‘నవంబర్‌ 9న లక్ష్మీతో మీ ఇంటికి వస్తున్నాం. సిద్ధంగా ఉండండి’ ఇంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్‌ 9న ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో మంచి విజయం సొంతం​ చేసుకున్న కాంచనకు రీమేక్‌.  హిందీలో డైరెక్టర్‌గా రాఘవా లారెన్స్‌కు  ఇది మొదటి చిత్రం. 

Advertisement
 
Advertisement
Advertisement