వసుదేవసుతం దేవం | Akash Jagannadh Launched Vasudeva Sutham Dhevam Song from Vasudeva Sutham Movie | Sakshi
Sakshi News home page

వసుదేవసుతం దేవం

Nov 2 2025 12:07 AM | Updated on Nov 2 2025 12:40 AM

Akash Jagannadh Launched Vasudeva Sutham Dhevam Song from Vasudeva Sutham Movie

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్‌ హీరోగా నటించిన చిత్రం ‘వసుదేవసుతం’. వైకుంఠ్‌ బోను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంబికావాణి, జాన్‌ విజయ్, ఐశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్‌ కనకాల, టార్జాన్‌ ఇతర పాత్రలు పోషించారు. బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్‌ యువ్వాంశ్‌ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘వసుదేవసుతం దేవం...’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను హీరో ఆకాశ్‌ జగన్నాథ్‌ విడుదల చేశారు. ఈ పాటకి చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించగా, పవన్‌–శ్రుతిక సముద్రాల పాడారు.  పాట చాలా బాగుంది. మహేంద్రన్‌ మంచి నటుడు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ఆకాశ్‌ జగన్నాథ్‌ చెప్పారు. ఈ సినిమాకి కెమెరా: జిజ్జు సన్నీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement