AHA OTT: Aha Upcoming Telugu Movies And Programs Releases In March 2022- Sakshi
Sakshi News home page

AHA Calendar: మార్చిలో ఆహాలో రిలీజయ్యే సినిమాలు, సందడే సందడి!

Mar 5 2022 8:30 AM | Updated on Mar 5 2022 10:22 AM

AHA Calendar:List Upcoming Movies In March - Sakshi

మార్చి నెలలో రిలీజయ్యే సినిమాలు, ప్రోగ్రామ్స్‌ పేర్లను వెల్లడిస్తూ క్యాలెండర్‌ను రిలీజ్‌ చేసింది ఆహా. ఇందులో మార్చి 4న డీజే టిల్లును అందుబాటులోకి తీసుకురాగా మార్చి 11న ఖుబూల్‌ హై మూవీని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపింది.

కరోనా కాలంలో ఓటీటీలు శరవేగంగా పుంజుకున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సినీప్రియులను ఆకర్షిస్తూ వినోదాన్ని పంచాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌కు గట్టిపోటీనిచ్చేందుకు ఆహా పుట్టుకొచ్చింది. తెలుగువారు ఎలాంటి వినోదాన్ని కోరుకుంటారు? వారికెలాంటి సినిమాలు నచ్చుతాయి? అన్న నాడి పట్టుకుని కొత్త, పాత సినిమాల కలయికతో అందరినీ అలరిస్తోంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌ చేస్తూ ఆహా అనిపిస్తోంది.

మార్చి నెలలో రిలీజయ్యే సినిమాలు, ప్రోగ్రామ్స్‌ పేర్లను వెల్లడిస్తూ తాజాగా క్యాలెండర్‌ను రిలీజ్‌ చేసింది ఆహా. ఇందులో మార్చి 4న డీజే టిల్లును అందుబాటులోకి తీసుకురాగా మార్చి 11న ఖుబూల్‌ హై మూవీని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపింది. అలాగే మార్చి 18న జూన్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఇటీవల థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా కూడా త్వరలో ఆహాలోకి రానుందని ఊరించింది. కానీ ఆ సినిమా పేరు మాత్రం తెలపలేదు.

మట్టిలో మాణికాల్యను వెలుగుతీసే కార్యక్రమం ఇండియన్‌ ఐడల్‌ షోకు సంబంధించిన అప్‌డేట్‌లను కూడా ఇందులోనే వెల్లడించింది. మార్చి 4, 5న ఆడిషన్స్‌, 11, 12న థియేటర్‌ ఆడిషన్స్‌,  18, 19న గ్రాండ్‌ ప్రీమియర్‌, 25, 26న గాలా ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అవనున్నట్లు తెలిపింది. ఈ ఇండియన్‌ ఐడల్‌ ప్రతి శుక్ర, శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుందని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement