Manju Warrier : స్టార్‌ హీరో అజిత్‌ సినిమా కోసం పాట పాడిన మంజూ వారియర్‌

Actress Manju Warrier Sings For Ajith Thunivu Movie - Sakshi

తమిళసినిమా: నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తుణివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేర్కండ పారై్వ, వలిమై వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం తుణివు.. షూటింగ్‌ పూర్తి చేసుకుని పొంగల్‌ సందర్భంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. మలయాళ సూపర్‌ స్టార్‌ మంజు వారియర్‌ ఇందులో నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విజయ్‌ కథానాయకుడిగా నటించిన వారీసు చిత్రం కూడా పొంగల్‌ రేస్‌కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. అదే విధంగా కోలీవుడ్‌లో వారీసు చిత్రం కూడా పొంగల్‌ రేస్‌కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది అదే విధంగా కోలీవుడ్‌లోనూ వారీసు, తుణివు చిత్రాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కారణం విజయ్, అజిత్‌ చిత్రాల మధ్య పోటీ ఉండడమే.గతంలో అజిత్‌ నటించిన వీరం, విజయ్‌ నటించిన జిల్లా చిత్రాలు ఒకేసారి విడుదలై రెండూ మం విజయాన్ని సాధించాయి.

ఆ తర్వాత ఇప్పటివరకు అలాంటి పోటీ పరిస్థితి రాలేదు. అలాంటిది ఎన్నాళ్లకు మళ్లీ ఈ ఇద్దరు స్టార్‌ చిత్రాలు మధ్య పోటీ తప్పడం లేదు. అజిత్‌ నటిస్తున్న తుణివు చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందడం విశేషం. దీంతో అజిత్‌ గానీ.. ఆయన అభివనులు గానీ.. ఎలాంటి టెన్షన్‌ పడటం లేదు.తమ అభిమాన నటుడు చిత్రానికే అధిక థియేటర్లు.. లభిస్తాయనే ధీమాతో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తుణివు చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్‌ను ఆ చిత్ర హీరోయిన్‌ మంజు వారియర్‌ వెల్లడించారు. ఈ చిత్రం కోసం ఆమె ఒక పాట పాడిందన్నదే ఆ అప్డేట్‌. ఈ విషయాన్ని ఆమె సంగీత దర్శకుడు జిబ్రాన్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్త తెలియజేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top