Actress Kasthuri: ఆంటీ అంటున్నారంటే మీలో చెడు ఆలోచనలు ఉన్నట్లే

Actress Kasthuri On Anasuya Aunty Controversy - Sakshi

భారతీయుడు, అన్నమయ్య వంటి సినిమాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్‌లో రాణిస్తోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సూపర్‌ క్రేజ్‌ దక్కించుకుంటున్న ఆమె తాజాగా అనసూయ ఆంటీ వివాదంపై స్పందించింది. 'చిన్నపాప ఆంటీ అని పిలవడానికి, దున్నపోతులాగా ఉన్న వ్యక్తి వచ్చి మమ్మల్ని ఆంటీ అనడానికి చాలా తేడా ఉంది. అడల్ట్‌ అయితే మహిళలను ఆంటీ అని పిలవడం కరెక్ట్‌ కాదు. చిన్నపిల్లలు మాత్రమే ఆంటీ అనడం కరెక్ట్‌. ఒక హీరోనో, నటుడినో అంకుల్‌ అని పిలుస్తారా?  అనసూయ కంటే రెట్టింపు వయసున్న హీరోలను అంకుల్‌ అని చూడండి... అనరు కదా! మరి ఆడవాళ్లను మాత్రం ఆంటీ అనడం దేనికి? ఆల్‌రెడీ ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్‌ కూడా వచ్చేసింది. మీకు ఇతరుల మీద గౌరవం లేదంటేనో, మనసులో ఏదో చెడు ఆలోచనలు ఉంటే మాత్రమే ఆంటీ అని పిలుస్తారు. ఈ విషయంలో అనసూయకు నేను మద్దతుగా ఉంటాను' అని పేర్కొంది కస్తూరి.

రాజకీయ ఎంట్రీపై స్పందిస్తూ.. 'నేను తమిళనాడు రాజకీయాలపై అనాలసిస్‌ చేస్తుంటా. తెలుగు రాజకీయాల గురించి తెలియదు. కానీ దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారికి పెద్ద అభిమానిని. తమిళనాడులో దాదాపు అన్ని పార్టీలు నన్ను ఆహ్వానించాయి. కాకపోతే నేను ఉన్నదున్నట్లుగా మాట్లాడతాను. ఒకవేళ ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీ చేసే తప్పులను వేలెత్తి చూపలేం. ఇప్పుడు ఖుష్బూ పరిస్థితి అలాగే ఉంది. అలాగే పాలిటిక్స్‌లో ఉండాలంటే ఎంతో డబ్బుండాలి. నాదగ్గర అంత లేదు, కాబట్టి రాజకీయాల్లోకి రాలేను' అని తెలిపింది కస్తూరి.

చదవండి: ఇద్దరు భార్యలపై చేయి చేసుకున్న యూట్యూబర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top