
ఉత్తరాది భామలు కోలీవుడ్‌లో పాగా వేయడం అనేది కొత్తేమీ కాదు. అలా తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటి కాజల్ చౌహాన్ కోలీవుడ్‌తో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పలు మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ షూటింగ్ స్టార్ అనే తమిళ చిత్రంలో రెండవ కథానాయకిగా నటించనున్నారు. ఎం.జే.రమణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాజీ గణేశన్ మనవడు దుష్యంత్, రవికిషన్, మసుమ్ శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ వినోద భరితంగా సాగే ఈ చిత్రం చివరిలో ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుందన్నారు. ఇది కోలీవుడ్‌లో తనకు మంచి ఎంట్రీ చిత్రం అవుతుందనే నమ్మకాన్ని నటి కాజల్ చౌహాన్ వ్యక్తం చేశారు.తన ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.