సిల్క్‌ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని | Actress Jayamalini Revealed Facts About Silk Smitha | Sakshi
Sakshi News home page

Silk Smitha-Jayamailini: సిల్క్‌ స్మిత చేసిన పెద్ద తప్పు అదే

Mar 19 2024 7:18 AM | Updated on Mar 19 2024 8:44 AM

Actress Jayamalini Revealed Facts Silk Smitha - Sakshi

క్షణికావేశం, విరక్తి.. మనిషి జీవితాన్ని కోల్పోవడానికి కారణం అవుతుంటాయి. మరి ఏమైందో ఏమో గానీ శృంగార తార సిల్క్‌ స్మిత అప్పట్లో ఇలానే బలవన్మరణానికి పాల్పడింది. 35 ఏళ్ల వయసులోనే అంటే 1996లోనే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అప్పట్లో స్మితతో పాటు పలు సినిమాలు చేసిన జయమాలిని.. తాజాగా స్మిత మరణం గురించి మాట్లాడింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్)

'అతి తక్కువ కాలంలోనే పేరు, ప్రఖ్యాతలతో పాట డబ్బు సంపాదించిన నటి సిల్క్‌ స్మిత. షూటింగ్‌ స్పాట్‌లో ఆమె నాతో మాట్లాడేదే కాదు. ఓ సినిమాలో హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్‌ స్మిత నటించాం. అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే సిల్క్‌ స్మిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. అది ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు' 

'ప్రేమించడం తప్పు కాదు కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండకూడదు. ఎందుకంటే సిల్క్‌ స్మిత.. ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మేసింది. అతడు మోసం చేశాడు. ఒకవేళ తల్లిదండ్రులు పక్కనుంటే బాధలో అండగా ఉండేవారు. సొంతవాళ్లు లేకపోతే చాలామంది మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అలానే సిల్క్‌ స్మిత బలైపోయింది' అని జయమాలిని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయాయి.

(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్ హారిక నారాయణ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement