Actor Sivakarthikeyan Takes Break From Twitter - Sakshi
Sakshi News home page

Actor Sivakarthikeyan: అలాంటి నిర్ణయం తీసుకున్న హీరో శివకార్తికేయన్‌.. కారణం ఏంటో?

May 1 2023 1:35 PM | Updated on May 1 2023 3:08 PM

Actor Sivakarthikeyan Takes Break From Twitter - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు మాంచి క్రేజ్‌ ఉంది. రెమో, డాక్టర్, డాన్ లాంటి డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

చదవండి: సూపర్‌ స్టార్‌ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్‌

గతేడాది జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌ దర్శకత్వంలో తెలుగులో ప్రిన్స్‌ అనే సినిమాను చేశారు. ప్రస్తుతం మహావీరన్‌ అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్‌ ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు.

ట్విటర్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 'మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. సినిమా అప్‌డేట్స్‌ నా టీమ్‌ షేర్‌ చేస్తుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ బ్రేక్‌ ఎందుకన్నది మాత్రం ఆయన రివీల్‌ చేయలేదు. చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్‌ మాస్టర్‌ మేనమామ
 

Advertisement
 
Advertisement
Advertisement