కరూర్‌ ఘటనపై 'ఛీ' అంటూ సత్యరాజ్‌ విమర్శలు | Actor satyaraj coments on karur Stmped | Sakshi
Sakshi News home page

కరూర్‌ ఘటనపై 'ఛీ' అంటూ సత్యరాజ్‌ విమర్శలు

Sep 29 2025 2:44 PM | Updated on Sep 29 2025 3:02 PM

Actor satyaraj coments on karur Stmped

తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్స్‌ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నటుడు సత్యరాజ్‌ రియాక్ట్‌ అయ్యారు. విజయ్‌పై ఆయన విమర్శలు చేశారు.

కరూర్‌ ఘటన గురించి సత్యరాజ్‌ ఇలా అన్నారు.. " ఒక్కోసారి తప్పులు అనేవి మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. కానీ, తెలిసి ఎవరైనా తప్పు చేస్తే  వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది చిన్న తప్పు అయితే, దాన్ని సరిచేసుకోవాలి. ఒకవేళ అది అనుకోకుండా పెద్దదైతే మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఛీ!" అంటూ సత్యరాజ్ పోస్ట్‌ చేశారు.

విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  ఇప్పటికే ఆయన సభల్లో 8మంది మరణించారు. తను ప్రయాణించే వాహనం కింద బైకర్స్‌ పడిపోయి కొందరు తీవ్రంగానే గాయపడ్డారు. ఇలా తరుచుగా విజయ​ సభల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతను కట్టడి చేయడం తమిళనాడు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయం కోర్టుకు కూడా తెలిపారు. ఇప్పుడు సినీ నటుడు సత్యరాజ్‌ కూడా దానిని పరోక్షంగా చెప్పారు. తను పాల్గొంటున్న ర్యాలీలో ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం విజయ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్యరాజ్‌ పరోక్షంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement