Aamir Khan: అప్పుల వాళ్లు ఇంటి మీదకు వచ్చారు, ఏం చేయలేక ఏడ్చేశా: ఆమిర్‌

Aamir Khan Recalls About His Father Financially Struggle in Childhood - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ కన్నీరు పెట్టుకున్నాడు. రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆయన తన చిన్నతనంలో గడ్డు పరిస్థితులను చూశానంటూ ఆసక్తికరవ్యాఖ్యాలు చేశాడు. ఈ సందర్భంగా ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ తన బాల్యంలో జరిగిన ఓ చేదు సంఘటనను పంచుకున్నాడు. తన చిన్నతనంలో ఇంటి మీదకి అప్పుల వాళ్లు వచ్చినప్పుడు తాను ఏమీ చేయలేక ఏడ్చేశానంటూ కన్నీటి పర్యంతరమయ్యాడు.

ఈ మేరకు ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు 10 సంవత్సరాలు. ఆ సంవత్సరం నాన్న తాహిర్‌ హుస్సేన్‌ లాకెట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన జితేంద్ర, రేఖ, ఖాదర్‌ ఖాన్‌ వంటి స్టార్‌ నటీనటులనే తీసుకున్నారు. నాన్న పెద్ద నిర్మాత కాకపోవడంతో వారు సరిగ డేట్స్‌ ఇచ్చేవారు కాదు. దాంతో ఈ సినిమా పూర్తవడానికి దాదాపు 8 ఏళ్లు పట్టింది. నాన్న దగ్గర డబ్బులు అయిపోయి మేం రోడ్డు మీద పడేస్థితికి వచ్చాం’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

అనంతరం ‘‘అప్పులిచ్చిన వాళ్లు ఇంటి మీదకు వచ్చి డబ్బులెప్పుడిస్తారంటూ నాన్నను నిలదీసేవారు. ‘నటీనటులు నాకు డేట్స్‌ ఇవ్వడం లేదని, సినిమా పూర్తైతేనే చేతికి డబ్బులు వస్తాయి’ అని నాన్న వారిని బతిమాలేవారు. కానీ అది వారికి అనవసరం కదా. అప్పుడు నేను చిన్నవాడిని అయినందున ఏం చేయలేని పరిస్థితి. దీంతో నేను ఏం చేయలేక ఏడ్చేశాను. ఆ సమయంలో నాన్న పడ్డ కష్టాలను చూస్తే నాకు కన్నీరు ఆగలేదు. నటీనటులకు రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వకపోవడంతో వారు షూటింగ్‌లకు వచ్చేవారు కాదు. దాంతో నాన్న వారిని బ్రతిమిలాడేవారు’’ అంటూ నాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్ని భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా రీసెంట్‌గా లాల్‌ సింగ్‌ చద్దా మూవీతో అలరించిన ఆమిర్ ప్రస్తుతం స్పానిష్ మూవీ రీమేక్‌లో నటిస్తున్నాడు. 

చదవండి: 
బిగ్‌బాస్‌ 6: హాట్‌టాపిక్‌గా ఫైమా రెమ్యునరేషన్‌! 13 వారాలకు ఎంతంటే?
ఆసక్తికర సంఘటన.. నెక్ట్స్‌ మహానటి ఎవరు? ఆ స్టార్‌ హీరోయిన్‌ పేరు చెప్పిన అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top