30 Weds 21: క్లాసులు వింటూ యాక్టింగ్‌ చేసిన అనన్య

30 Weds 21 Web Series Chaitanya, Ananya Interview With Sakshi

30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతికి వివాహం జరిగితే ఎలా ఉంటుంది? పెళ్లి తర్వాత వారి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు, భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో వచ్చింది "30 వెడ్స్‌ 21". 'నో ప్రెజరమ్మా..', 'మోకాల్‌ చిప్పలు పగలగొడ్త..' వంటి హీరోయిన్‌ డైలాగులు బాగా పాపులర్‌ అయ్యాయి. ముఖ్యంగా 'జీవితమే ఒక సముద్రమైతే అందులో ఉప్పు నా దరిద్రం' అన్న కొటేషన్‌ను బీభత్సంగా వాడేస్తున్నారు.

తాజాగా 30 వెడ్స్‌ 21 టీమ్‌ చైతన్య, అనన్య, శరత్‌ సాక్షి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వెబ్‌ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయని చెప్పారు. దీనికి భీమవరం అబ్బాయి జోస్‌ జిమ్మీ సంగీతం అందించాడని, ఈ టీమ్‌లో అందరూ కొత్తవాళ్లేనని పేర్కొన్నారు. ఇక హీరో చైతన్యది కరీంనగర్‌ కాగా హీరోయిన్‌ అనన్య వరంగల్‌ పుట్టి కరీంనగర్‌లో పెరిగానని చెప్పింది.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. తను ఈసీఎమ్‌ చదువుతున్నానని, కాలేజీ డేస్‌ నుంచే నాటకాల్లో పాల్గొనేదాన్నని తెలిపింది. తనింకా చిన్నపిల్ల అని, బ్రేకప్‌లాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్‌ చిత్రీకరణ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు వింటూ యాక్టింగ్‌ చేసేదాన్నని చెప్పింది. మరి వాళ్లు ఇంకా ఏమేం విషయాలు చెప్పారో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి..

చదవండి: మహేశ్‌ 'పార్థు' మూవీ! ఫారిన్‌లో షూట్‌?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top