రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్‌ సందేశ్‌.. బోల్డ్‌ పోస్టర్‌ రిలీజ్‌

Varun sandhesh Ready To Re Rntry With Induvadana Movie Poster Out - Sakshi

హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం సినిమాలతో ఓవర్‌ నైట్‌ క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌. అయితే ఆ తర్వాత వరుణ్‌ సందేశ్  చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్‌ ఇచ్చిన వరుణ్‌ సందేశ్‌ బిగ్‌బాస్‌ షోతో ద్వారా మరోసారి తెలుగు ఆడియోన్స్‌కు దగ్గరయ్యాడు. సీజన్‌-3లో మిస్టర్‌ కూల్‌ అనే ట్యాగ్‌ లైన్‌ను సంపాదించుకున్నాడు. ఓ దశలో బిగ్‌ బాస్‌ విన్నర్‌ వరుణ్‌ సందేశే అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టాప్‌4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బిగ్‌బాస్‌ సీజన్‌-3 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వరుణ్‌ తాజాగా ఓ సినిమా అనౌన్స్‌ చేసి మరోసారి రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకం నిర్మిస్తుంది. వరుణ్‌ సందేశ్‌ సరసన ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.  ఇందువదన అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వస్తోన్న వరుణ్‌ సందేశ్‌ సోమవారం ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. చాలా గ్యాప్‌ తర్వాత సినిమా చేస్తుండటం, పోస్టర్‌ బోల్డ్‌గా ఉండటంతో ఈ మూవీ కథ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. పోస్టర్‌ వేరె లెవల్‌లో ఉందంటూ వరుణ్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్‌
యాంకర్‌ రవి కారులో.. సీక్రెట్స్‌ బయటపెట్టేసిన లాస్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top