పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్‌

Vadinamma Serial Actor Rajesh Datta Wife Files Complaint Against Him - Sakshi

నటుడు రాజేష్‌ దత్తాపై పోలీసులను ఆశ్రయించిన భార్య సాధన

సాక్షి, హైదరాబాద్‌ : వదినమ్మ, చంద్రలేఖ వంటి సీరియల్స్‌లో హీరోలా, ఎంతో అమాయకంగా కనిపించే రాజేష్‌ దత్తా.. రియల్‌ లైఫ్‌లో మాత్రం తన విలనిజం చూపిస్తున్నాడు. భార్య ఉండగానే వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని తనను హింసిస్తున్నాడని అతడి భార్య అరుణ అలియాస్‌ సాధన పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కాలేదని అబద్దాలు ఆడి వేరే అమ్మాయిలతో ఎఫైర్స్‌ పెట్టుకునేవాడని, ఇదేంటని ప్రశ్నిస్తే తనను ఇంట్లోంచి గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై గట్టిగా నిలదీస్తే..అంతా నా ఇష్టం. నేను ఎవరితోనైనా తిరుగుతాను, నీ ఇష్టమొచ్చింది చేసుకోపో అంటూ  రాజేష్‌ తెగేసి చెప్పేవడని, అంతేకాకుండా ఆ అమ్మాయిలను డైరెక్ట్‌గా ఇంటికే తీసుకొచ్చేవాడని వాపోయింది.

'2105 జూన్‌6న సీరియల్‌ నటుడు రాజేష్‌ దత్తాతో విజయవాడలో చాలా గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. 15 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం కూడా కట్నంగా ఇచ్చాం. పెళ్లైన మూడు నెలలు మా సంసారం సాఫగా, ఎంతో అన్యోన్యంగా సాగింది. అయితే ఆ తర్వాత రాజేష్‌ తీరులో చాలా మార్పొచ్చింది. నన్ను చెన్నై తీసుకెళ్లాడు. సీరియల్స్‌ అంటూ తను మాత్రం హైదరాబాద్‌ వచ్చేవాడు. వేరే అమ్మాయిలతో తనకు పెళ్లి కాలేదని అబ్బదాలు ఆడి వాళ్లతో సంబంధాలు పెట్టుకునేవాడు. ఇందేంటని అడిగితే తనని హింసించేవాడు' అని రాజేష్‌ భార్య సాధన వివరించింది. 

అమ్మాయిలను ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావు అని ప్రశ్నించినందుకు కట్టుబట్టలతో తనను ఇంట్లోంచి గెంటేశాడని పేర్కొంది. ఈ విషయంపై తన తల్లిదండ్రులతో కలిసి జగద్గిరి పోలీసులను ఆశ్రయించిన సాధన భర్త రాజేష్‌పై ఫిర్యాదు చేసింది. మరోవైపు రాజేష్‌ ఇంటి వద్ద బైటాయించిన సాధన తనకు న్యాయం కావాలని డిమాండ్‌ చేస్తోంది. ఇక నటుడు రాజేష్‌.. కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ, తూర్పు వెళ్లే రైలు సహా దాదాపు 28 సీరియల్స్‌లో నటించాడు. 


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top