ఘనంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

టేక్మాల్‌(మెదక్‌): మండలంలోని కోరంపల్లి గౌడసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 108 వైరాగ్య శిఖామణి అవదూతగిరి మహరాజ్‌, దత్తగిరి మహరాజ్‌ కరకములచే యంత్ర, ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించారు.

వైభవంగా పెద్దమ్మతల్లి ఉత్సవాలు

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని శాలిపేటలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆల య వార్షికోత్సవ ఉత్సవాలకు ఎమ్మె ల్యే మైనంపల్లి రోహిత్‌ హాజరయ్యారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో గ్రామాల్లో ప్రశాంతం వాతావరణం వెల్లివిరిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ క్యాతమ్మ, ఉపసర్పంచ్‌ కిష్టయ్య, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement