వీఓఏల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

వీఓఏల సమస్యలు పరిష్కరించండి

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): ప్రభుత్వం ఐకేపీ వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి ఏసు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కౌడిపల్లిలో ఐకేపీ కార్యాలయం వద్ద మండల సమాఖ్య అధ్యక్షురాలు పుణ్యమ్మకు సమ్మె నోటీసు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీఓఏలకు కనీస వేతనం రూ.20 వేలు చెల్లించి ఉద్యోగ భద్రత, హెచ్‌ఆర్‌ పాలసీ వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. ఇన్సూరెన్స్‌ రూ. 20లక్షలు వర్తింపచేయాలని కోరారు. గ్రేడింగ్‌ విధానం తీసివేసి జీఓ 58ని సవరించాలన్నారు. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్‌ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఈ నెల 18లోపు ప్రభుత్వం వీఓఏల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శశిరేఖ, రాజు, సామేల్‌, స్వాతి, లావణ్య, జ్యోతి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కార్యదర్శి యేసు

Advertisement
 
Advertisement
Advertisement