నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ లక్ష్మి అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ మేరకు 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీకి సాధారణ నిధులు, గ్రాంట్లు కలిపి రాబోయే ఆర్థిక సంవత్సరానికి 19కోట్ల 36లక్షల 95వేల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు మున్సిపాలిటీ గణాంక అధికారి సంతోషిరాణి వివరించారు. అదే సంవత్సరానికి 19కోట్ల 31లక్షల 75వేల రూపాయల వ్యయం ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. 2026– 27 సంవత్సరానికి 10శాతం గ్రీన్ బడ్జెట్ కోసం 1కోటి 42లక్షల 90వేల రూపాయలు కేటాయించామని, మిగులు బడ్జెట్ 26లక్షల 51వేల రూపాయలని తెలపగా సభ్యులు ఆమోదించారు. పట్టణంలోని పలు సమస్యలపై సమావేశంలో చర్చించి వాటిని పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారుల సమన్వయంలో కృషి చేయాలని సూచించారు. సమావేశంలో వైస్ చైర్మన్ బుచ్చెష్‌యాదవ్, కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మిగులు బడ్జెట్ 26.51 లక్షలు
సాధారణ నిధులు, గ్రాంట్లతో అభివృద్ధి


