పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో ఐదు రోజు లుగా కొనసాగుతున్న వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. గ్రామపాలనలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు, పారదర్శకత, ప్రజ లతో సమన్వయం, పంచాయతీ రాజ్ చట్టాలపై అవగాహన పెంచుకొని, గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, మాస్టర్ ట్రైనర్లు తస్లీమ్ పాషా, లింగప్ప, ప్రవీణ్, సోమేశ్వర్ తదితరులున్నారు.
వార్డు మెంబర్లకు సర్టిఫికెట్స్ అందజేత
నిజాంపేట(మెదక్): మండలంలోని గ్రామ పంచాయతీలో నూతనంగా ఎంపికై న వార్డు సభ్యులకు నిజాంపేట మండల కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లను ఎంపీడీఓ రాజిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలంలో మొదటి బ్యాచ్ వార్డు సభ్యులకు వార్డు అభివృద్ధి చేయాలంటే వార్డు సభ్యుల ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. గ్రామసభకు ప్రతి ఒక్కరు హాజరై వార్డుల్లోని సమస్యలపై చర్చించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం వార్డు సభ్యులదేనని అన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింహారెడ్డి, ట్రైనర్లు కుమార్, శ్రీకాంత్, అశోక్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.


