కౌడిపల్లి(నర్సాపల్లి): మండల కేంద్రం కౌడిపల్లిలోని శ్రీఅభయ సీతారామాలయం 33వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం బండ్లను ఊరేగించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్, దేవులపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి, దేవతామూర్తులతో పాటు బండ్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కౌడిపల్లి, దేవులపల్లిలోని వివిధ కులాల సంఘాల ఆధ్వర్యంలో ఎడ్లబండ్లను ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణాగౌడ్, ఉపసర్పంచ్‌లు శ్వేత మల్లికార్జున్‌గౌడ్, శ్రీకాంత్, నాయకులు శ్రీనివాస్‌గుప్తా, దుర్గాగౌడ్, రాజు, మగ్బుల్, ప్రశాంత్, శాఖయ్య, పుండరీకంగౌడ్, లక్ష్మన్‌యాదవ్, భుమయ్య పాల్గొన్నారు.
దుర్గమ్మకు బండ్ల ప్రదక్షిణలు
అల్లాదుర్గం(మెదక్): మండల పరిధి ముస్లాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో భాగంగా బండ్ల ప్రదక్షిణలు చేశారు. గ్రామ స్తులు, చుట్టు పక్క గ్రామాలకు చెందిన భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు బండ్లను కట్టి ఉరేగింపుతో ప్రదక్షిణలు చేశారు. బండ్ల ఎదుట శివసత్తుల నృత్యాలు, భక్తులు సందడి చేశారు. వందలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బందోబస్తుతో పర్యవేక్షించారు. ఇందులో అల్లాదుర్గం ఎస్‌ఐ శంకర్ , పెద్దశంకరంపేట ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డిలు పాల్గొన్నారు.


