చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం చేగుంట మార్కెట్‌కు సంబంధించిన వేలంపాట సర్పంచ్ స్రవంతి, ఎంపీఓ విజయ్‌పాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. వేలంలో 24 లక్షల 5వేలకు చింతల భూపాల్ తైబజార్‌ను దక్కించుకున్నారు. నిబంధలన ప్రకారం గ్రామ పంచాయతీకి వేలం డబ్బు లు చెల్లించి ఒప్పంద పత్రం అందించి ఏప్రిల్ 1 నుంచి తైబజార్ డబ్బులను వసూలు చేయాలని ఎంపీఓ తెలిపారు. కార్యక్రమంలో ఈఓ వెంకటేశ్, ఉపసర్పంచ్ రఫీ, వార్డు మెంబర్లు రవి, ఆరీఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
చిలప్‌చెడ్(నర్సాపూర్): నీరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని అజ్జమర్రి మాజీ ఎంపీటీసీ మల్లయ్య అన్నారు. శనివారం ఆయన చిలప్‌చెడ్ మండల పరిధి అజ్జమర్రి గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఆత్మకమిటీ డైరెక్టర్ సత్యం, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు వీరాస్వామి పాల్గొన్నారు.


