తూప్రాన్: విద్యా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న పట్టణంలోని గీతా స్కూల్ యాజమాన్యానికి హన్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో విద్యా పురస్కారం లభించిందని పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, విలువలతో కూడిన విద్య, వ్యక్తిగత వికాసం, క్రమశిక్షణ, సృజనాత్మకత లాంటి అంశాల్లో వేలాది విద్యార్థులను తీర్చిద్దినందునకు గీతా హైస్కూల్‌కు అవార్డు లభించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పాఠశాల కరెస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ పి.ఉష, డైరెక్టర్ భరత్‌లు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు రాఘవేందర్‌గౌడ్, నారాయణగుప్తా, మౌనిక, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్‌రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


