పెద్దశంకరంపేట(మెదక్): ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ముసాపేట, జూకల్, వీరోజిపల్లి, బద్దారం గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోనికి వచ్చిందని, రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌పార్టీ అధికారంలోనికి వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రోషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మండల రైతుబంధు మాజీ అధ్యక్షుడు సురేష్‌గౌడ్, బోండ్ల దత్తు, సర్పంచ్ విఠల్‌నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు.


