శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి మన్య సూక్త పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులు అభిషేకం, సత్యనారాయణస్వామి మండపంలో సమూహిక వ్రతాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయశర్మ, సర్పంచ్ నారాయణరావు, ప్రధాన అర్చకుడు దేవదాత్తశర్మ, దేవిశ్రీ, ప్రభుశర్మ, సిబ్బంది ఉన్నారు.


