ఎన్నికల నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్
శివ్వంపేట(నర్సాపూర్): ఎన్నికల నిబంధనలను సిబ్బంది కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల పరిధి చెండీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ సెంటర్‌ను సాయంత్రం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూడో విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. సిబ్బందికి తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజనం, ఇతర అన్ని వసతులు కల్పించాలన్నారు. చెక్‌లిస్టు ఆధారంగా ఎన్ని కల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీఓ తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ నరేందర్‌రెడ్డి, ఎంఈఓ బుచ్చనాయక్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి
శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే బీఆర్‌ఎస్ బలపరిచిన ఆభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమ వారం మండలంలోని గోమారం, పిల్లుట్ల తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో ప్రత్యేక పంచాయతీల ఏర్పాటుతో పాటు వాటి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు హన్మంత్‌తరెడ్డి, మహిపాల్‌రెడ్డి, చింత స్వామి, రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రాదేశికంలో సత్తా చాటుదాం’
పాపన్నపేట(మెదక్): సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో ఎంపీని కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 15 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాన్ని కై వసం చేసుకుంటామని తెలిపారు. ఈసందర్భంగా గాజులగూడెం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన పుట్టల మల్లేశంను బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్‌చారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు
పథకాలే గెలిపిస్తాయి
నర్సాపూర్ రూరల్: సంక్షేమ పథకాలే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. మండలంలోని నాగులపల్లి, మూసాపేట, రుస్తుంపేట గ్రామాల్లో సోమవారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. నాగులపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొర్పోల్ సుమతి శివ కుమార్‌తో పాటు మూసాపేటలో డప్పు లక్ష్మి, రుస్తుంపేటలో గొర్రెల అశోక్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు, ఉచిత కరెంట్ తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
అక్కా.. నీ ఓటు నాకే
నర్సాపూర్ రూరల్: నాగులపల్లి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొర్పోల్ సుమతి శివకుమార్ సోమవారం మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు ఓట్లు అడిగారు. సర్పంచ్‌గా గెలిపిస్తే నా సొంత నిధులతో పాటు ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని వివరించారు.
ఎన్నికల నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్
ఎన్నికల నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్
ఎన్నికల నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్


