గ్రామాలు ప్రగతి బాట పట్టాలి
మెదక్‌జోన్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచే యాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించే బాధ్యత మీపై ఉందన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మధుసూదన్‌రావు, ముత్యంగౌడ్, శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్


