రంగంపేటలో ఉద్రిక్తత
కొల్చారం(నర్సాపూర్): మండలంలో రంగంపేటలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి అరిగి స్వర్ణలతకు మద్దతుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి సోమవారం ప్రచారం చేశారు. అయితే ఆమె మాట్లాడి వెళుతున్న క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు రెచ్చగొట్టే నినాదాలు చేయడం, ఎమ్మెల్యేకు అడ్డుగా రావడంతో భద్రతా సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్‌గుప్తాను సైతం తోసి వేయడంతో ఇరు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి స్వర్ణలతకు కాలుకు చిన్నపాటి గాయం కాగా, మరో మహిళ కింద పడటంతో చేతికి గాయాలయ్యాయి. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఇరువర్గాలను శాంతింపజేశారు.


