చెయ్యెత్తి.. జైకొట్టి
మలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. తొలి విడత మాదిరిగానే రెండో విడతలోనూ ఆ పార్టీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఈసారి గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ ఉనికిని చాటుకుంది. స్వతంత్రులు మాత్రం సత్తా చాటారు. సీపీఎం ఒక స్థానంతో సరిపెట్టుకుంది.
– మెదక్‌జోన్
రెండో విడతలో ఆదివారం జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఎనిమిది మండలాల పరిధిలో 142 సర్పంచ్, 1,036 వార్డు మెంబర్లకు పోలింగ్ జరిగింది. ఇందులో అత్యధికంగా 64 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. ప్రధా న ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఈసారి కూడా గట్టి పోటీ ఇచ్చింది. 46 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఢిల్లీలో అ ధికారంలో ఉన్న బీజేపీ గల్లీలో ఏమాత్రం ప్రభావం చూ పలేకపోయింది. కేవలం 11 సర్పంచ్ పదవులను మాత్రమే దక్కించుకుంది. నిజాంపేట లో 4, చేగుంట 3, రామాయంపేట 2, చిన్నశంకరంపేట మండలంలో ఒకటి చొప్పున అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్రులు మరోసారి సత్తా చాటారు. 20 స్థానాల్లో పాగా వేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులను ఓడించి ఆయా గ్రామాల్లో తమకు వ్యక్తిగతంగా పట్టుందని నిరూపించుకున్నారు. సీపీఎం బలపరిచిన అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. కాగా రెండో విడతలో ఇప్పటికే 7 సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవం అయ్యాయి.
మలి విడతలోనూ సత్తా చాటిన కాంగ్రెస్
64 సర్పంచ్ స్థానాలు కై వసం
గట్టి పోటీ ఇచ్చిన
బీఆర్‌ఎస్ మద్దతుదారులు
46 స్థానాల్లో కారు పార్టీ విజయం
20 చోట్ల సత్తా చాటిన స్వతంత్రులు
11 స్థానాలతో
సరిపెట్టుకున్న కమలం


