ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం
కౌడిపల్లి(నర్సాపూర్): ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరోసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దన్నారు. గ్రామాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమిలేదన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్, దుర్గారెడ్డి, పోలనవీన్, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, నవీన్‌గుప్తా శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.


