కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు
మెదక్ కలెక్టరేట్: కార్మికులు సృష్టించిన సంపద, ఖనిజాలను కార్పొరేట్ సంస్థలు దోచుకుంటున్నా యని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఆరోపించారు. సోమవారం పట్టణంలో రెండో రోజు జరిగిన సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు హాజరై మాట్లాడారు. కార్పొరేట్లకు వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటమే లక్ష్యంగా దిక్కరణ, ప్రతిఘటన అనే నినాదంతో సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులను ఎదుర్కొవాలంటే.. ఖచ్చితమైన ప్రణాళిక అ వసరమన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ ఇటీవల దూకుడు పెంచిందన్నారు. లేబర్ కోడ్‌ల విషయంలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. దీనికి కారణం కూడా కార్మిక ఐక్యతయే కారణమని వివరించారు. ఇలాంటి పోరాటాలు మరిన్ని జరగాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఒక రోజు సమ్మెతో 12 గంటల పని విధానాన్ని తిప్పికొట్టారని గుర్తు చేశారు. పోరాటాలు, ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు తగిన విధంగా చర్చలు జరపాలను సూచించారు. అంతకు ముందు సీఐటీయూ జెండాను ఆవిష్కరించి కార్మిక మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు హేమలత, జాతీయ కోశాధికారి సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, వీరయ్య, రాష్ట్ర కార్యదర్శులు వెంకటేష్, శ్రీకాంత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్లకు వ్యతిరేకంగా
కార్మిక వర్గం ఏకం కావాలి
సీఐటీయూ అఖిల భారత
ప్రధాన కార్యదర్శి తపన్ సేన్


