బస్వాపూర్‌ను అగ్రగామిగా నిలుపుతా
వెల్దుర్తి(తూప్రాన్): తన స్వగ్రామం బస్వాపూర్‌ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్ అన్నారు. సర్పంచ్‌గా తన భార్య నజ్మాసుల్తానాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి స్వగ్రామానికి రాగా, ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి విద్యాభ్యాసం, ఎమ్మెల్యేగా ఎదిగే వరకు గ్రామస్తులతో విడదీయరాని బంధం ఉందన్నారు. కులమతాలకతీతంగా సర్పంచ్ ఏకగ్రీవానికి కృషి చేసిన ప్రజలకు శక్తివంచన మేర సహకారం అందిస్తానన్నారు. తన ఉన్నతిలో సహకరించిన ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోనే తన భా ర్యను సర్పంచ్‌గా బరిలో ఉంచినట్లు తెలిపారు.
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్


