పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు
టేక్మాల్(మెదక్): పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఉపయోగించుకోవాలన్నారు. ఈనెల 11న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రియాజొద్దీన్, తహసీల్దార్ తులసీరాం, సీనియర్ అసిస్టెంట్ మాదవచారి, ఈఓ రాకేశ్ తదితరులు ఉన్నారు.
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
మెదక్ కలెక్టరేట్: ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు పా టిస్తూ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్‌అండ్‌బీ ఈఈ వేణు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పిరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్ర శాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


