కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి

Dec 9 2025 10:37 AM | Updated on Dec 9 2025 10:37 AM

కాంగ్

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి

పాపన్నపేట(మెదక్‌): మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ నాయకులకు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రజలను కోరా రు. సోమవారం మండలంలోని నాగ్సాన్‌పల్లి, కొడుపాక, శేరిపల్లి, బాచారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందఽర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన అధ్వానంగా ఉందని వాపోయా రు. ఈసందర్భంగా పలువురు నాయకు లు బీఆర్‌ఎస్‌లో చేరగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సంగప్ప, వెంకట్‌రాములు, చారి, శ్రీనివాస్‌గౌడ్‌, దత్తు, బాలయ్య, దావిద్‌ తదితరులు పాల్గొన్నారు.

పనులు వెంటనే

ప్రారంభించండి

తూప్రాన్‌: డివిజన్‌ పరిధిలోని చేగుంట–మెదక్‌ రోడ్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణంలో చెట్లు, విద్యుత్‌ లైన్ల తొలగింపు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు, ట్రాఫిక్‌ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై చర్చించారు. కాగా రైల్వే ఉన్నతాధికారులు సైతం పనుల్లో వేగం పెంచి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సీఐ రంగాకృష్ణ, మిషన్‌ భగీరథ ఈఈ సంపత్‌కుమార్‌, రైల్వే జీఎస్‌ సమీర్‌కుమార్‌, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఓటర్లు సహకరించాలి

మెదక్‌ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఓటరు సహకరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరా వు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా సోమవారం ఓటర్లకు ముఖ్య సూచనలు జారీ చేశారు. తెలియని వ్యక్తులకు ఓటర్‌ స్లిప్‌ ఇవ్వకూడదన్నారు. పోలింగ్‌ కేంద్రంలో క్యూలో నిలబడి సిబ్బంది సూచనలు పాటిస్తూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కౌంటింగ్‌ అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. అనంతరం ఇటీవల జిల్లా లో పోగొట్టుకున్న రూ. 15,34,000 విలువ గల 110 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసి సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఆ అధికారులపై

చర్యలు తీసుకోండి

టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌

మెదక్‌జోన్‌: రాష్ట్ర ఆర్థికశాఖలో అవినీతికి తెరలేపిన అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షు డు నరేందర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను ప్రతి నెల రూ. 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నవంబర్‌ నెలకు సంబంధించి ఆర్థికశాఖ రూ.707.30 కోట్లు విడుదల చేయగా, ఆ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉద్యోగులకు కేవలం రూ. 200 కోట్లు మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు స్పందించి రిటైర్డ్‌ ఉద్యోగులకు రావాల్సిన సొమ్మును వెంటనే విడుదల చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మద్యం బాటిళ్లు సీజ్‌

వెల్దుర్తి(తూప్రాన్‌): మండలంలోని కుకునూర్‌లో బెల్ట్‌షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా వెల్దుర్తిలోని ఓ మద్యం దుకాణం నుంచి 36 బీరు బాటిళ్లను బైక్‌పై యశ్వంతరావుపేటకు తరలిస్తుండగా పట్టుకుకొని ఇరువు రిపై కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి 
1
1/2

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి 
2
2/2

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement