పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పా ట్లు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మొదటి విడత జరిగే ఎన్నికల కోసం సిద్ధం చేసిన ఎన్నికల సామగ్రిని ఆదివారం పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీ ఓ శ్రేయంత్, ఎంపీఓ వెంకటేశం, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. అనంతరం మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా మద్యం, ఇతర వస్తువులను వాహనాల్లో తరలించే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.


