మృతదేహాలు అప్పగింత
హవేళిఘణాపూర్(మెదక్): కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో మరణించిన తల్లీబిడ్డల మృతదేహా లను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంధ్యారాణి, చందన మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించారు. ఈ మేరకు అంబులెన్స్‌లో బయలు దేరినట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం శివ్వాయపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
నర్సాపూర్: ప్రధాని మోదీ 127వ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ పలువురి నాయకులతో కలిసి నర్సాపూర్‌లో వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో ప్రధాని సూచనలు పాటిస్తామన్నారు. పార్టీ అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు నగేశ్, బాల్‌రాజ్, చంద్రయ్య, శంకర్, రాజు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 31న భారీ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 30వ తేదీ సాయంత్రంలోగా ఆర్‌ఎస్‌ఐ నంబర్ (8712657954)లో సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి (సిద్దిపేట): మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత మంది గంగిరేణు చెట్టు ప్రాంగణంలో పట్నాలు వేసి, ముడుపులు కట్టారు. మరికొంత మంది అభిషేకాలు, కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ పర్యవేక్షించారు.
చివరి గింజ వరకు కొంటాం
డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి
కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కుకునూరుపల్లిలో ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ గింజకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏ గ్రేడ్ క్వింటాల్ ధర రూ.2,389, కామన్ గ్రేడ్ ధర రూ. 2369లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. మార్కెట్‌కు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు తాలు, తేమ శాతం లేకుండా చూసుకొని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి. పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, నాయకులు పాల్గొన్నారు.
మృతదేహాలు అప్పగింత
మృతదేహాలు అప్పగింత


