పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ కుటుబాలకు శాఖ అండగా ఉంటుందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో మా ట్లాడి ఆరోగ్యం, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఎల్లప్పు డూ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ అధికారులను సంప్రదించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ టౌన్ ఇన్స్‌పెక్టర్ మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


