దళారులను నమ్మి మోసపోవద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూ చించారు. ఆదివారం మెదక్ మండల పరిధిలోని రాజ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తేమ శాతం పరిశీలించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు, ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తేమశాతం వచ్చిన తర్వాతే తూకం చేయాలని అన్నారు. రైతులకు టోకెన్లు అందించాలని సూచించారు. ధాన్యం తరలింపునకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


